News February 20, 2025

WGL: నిజనిద్దారణకు ఎంక్వయిరీ కమిటీ: కలెక్టర్ 

image

నర్సంపేట అసిస్టెంట్ లేబర్ అధికారిపై ఫిర్యాదు నేపథ్యంలో ఎంక్వయిరీ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో లేబర్ అధికారి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘానికి చెందిన సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిజాలను నిగ్గు తేల్చడానికి 10 రోజుల్లో విచారణ నిర్వహించిన నివేదిక అందజేయాలన్నారు.

Similar News

News March 15, 2025

హిందీ భాషపై కామెంట్స్.. పవన్‌పై వైసీపీ విమర్శలు

image

AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అన్న పవన్ <<15763560>>కళ్యాణ్‌పై<<>> YCP విమర్శలు గుప్పిస్తోంది. అప్పట్లో ‘హిందీ గో బ్యాక్’ అనే పేపర్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేయడాన్ని గుర్తుచేస్తోంది. ఆ ఆర్టికల్‌పై స్పందించిన ఆయన ‘నార్త్ ఇండియా రాజకీయ నేతలు మనదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకొని, గౌరవించాలి’ అని రాసుకొచ్చారు. మరి ఇప్పుడేమో జనసేనానికి హిందీపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.

News March 15, 2025

ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

image

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 15, 2025

VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

image

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST

error: Content is protected !!