News September 11, 2024
WGL: నిన్నటితో పోలిస్తే పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News November 21, 2025
వరంగల్: కలెక్టర్‌కు ఎమ్మెల్సీ సారయ్య శుభాకాంక్షలు

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరి-2లో వరంగల్ జిల్లాకు మొదటి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం MLC బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారదను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో జల సంరక్షణ చర్యలను విజయవంతంగా చేపట్టి రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండెటి నరేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 20, 2025
వరంగల్ కలెక్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.


