News September 11, 2024
WGL: నిన్నటితో పోలిస్తే పెరిగిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News October 13, 2024
కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: కేయూ రిజిస్ట్రార్
ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కళాశాలలకు విడుదలయ్యే ఫీజు రీయంబర్స్మెంట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కళాశాలను బంద్ చేస్తామని రిజిస్ట్రార్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి హెచ్చరించారు.
News October 13, 2024
హర్యానా గవర్నర్‌ను కలిసిన మాజీ MLA
హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించిన అలాయ్.. బలాయ్ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాజీ ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.
News October 13, 2024
MHBD: గన్‌తో కాల్చుకొని AR కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఆదివారం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్‌తో కాల్చుకొని మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.