News January 11, 2026
WGL: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ షెడ్యూల్డ్ కులాల ఆధ్యాపక కేంద్రం ద్వారా 5 నెలల పాటు వివిధ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటు, బ్యాంకింగ్, SSC వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 30 వరకు http://tsstudycircle.co.in/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News January 23, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 23, 2026
పిట్లం: గురువు ఉదారత.. అనాథ బాలుడికి విద్యాదాత!

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ విద్యార్థికి నేనున్నానంటూ భరోసానిచ్చారు తిమ్మానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ. పిట్లం (M) తిమ్మానగర్ MPUPSలో బోండ్ల ప్రణయ్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి మూడేళ్ల క్రితం, తల్లి అంబవ్వ ఇటీవల క్యాన్సర్‌తో మరణించారు. అనాథగా మారి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రణయ్‌ను ఆయన ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి, గురుకుల పాఠశాలలో సీటు, హాస్టల్ వసతి కల్పించారు.
News January 23, 2026
కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.


