News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 16, 2025
వేపాకుల కండిషనర్‌తో చుండ్రుకు చెక్

అమ్మాయిలకు జుట్టే అందం. ఒత్తయిన వెంట్రుకల కోసం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఇంట్లోనే వేపాకులతో తయారుచేసుకున్న హెయిర్ కండిషనర్ మేలంటున్నారు నిపుణులు. ‘వేపాకులను నీళ్లలో మరిగించి గుజ్జుగా చేసి కాస్త తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. చుండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం, రాలిపోవడమూ తగ్గుతుంది’ అని చెబుతున్నారు.<<-se>>#HairCare<<>>
News October 16, 2025
మంచిర్యాల: గురుకులాల సీట్ల భర్తీకి దరఖాస్తులు

మంచిర్యాల జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు అన్నారు. ఈ నెల 17 వరకు లక్షెట్టిపేట గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 16, 2025
రేపు గుంతకల్లుకు సినీ తారలు

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.