News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 8, 2026
హాస్టళ్లకు సమస్యల గ్రహణం.. ఇప్పుడన్న వీడేనా.?

జిల్లాలో మొత్తం 113 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. పలు హాస్టల్స్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వీటిని నెట్ జీరో ప్రాంగణాలుగా తీర్చిదిద్దేలా కలెక్టర్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రతి హాస్టల్‌లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, విద్యుత్, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలని సూచించారు. ఇందుకోసం నివేదికలు అందజేయాలని సూచించారు. ఇకనైనా సమస్యలు పరిష్కారం అవుతాయేమోనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
News February 8, 2026
చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.
News February 8, 2026
నిర్మల్: ‘పోస్టల్ బ్యాలెన్స్ సద్వినియోగం చేసుకోండి’

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈనెల 8, 9వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల సహాయ అధికారి తెలిపారు. నిర్మల్, భైంసా మున్సిపల్ కార్యాలయాలు, ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


