News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 13, 2025
BREAKING: HYD: తుక్కుగూడలో యువకుడు సూసైడ్

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి తుక్కుగూడలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో భానుప్రసాద్(22) అనే యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పహడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2025
BREAKING: HYD: తుక్కుగూడలో యువకుడు సూసైడ్

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి తుక్కుగూడలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో భానుప్రసాద్(22) అనే యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2025
నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు

నవంబర్ మొదటివారం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సోమవారం తెలిపారు. మార్కెటింగ్, వ్యవసాయం, పోలీస్, అగ్నిమాపక, రవాణా, సీసీఐ ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్లను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశామన్నారు. రైతు సేవా కేంద్రాల్లోని వీఏఏలను సంప్రదించి పత్తి విక్రయాల సమాచారాన్ని తెలుసుకోవాలని రైతులకు సూచించారు.