News April 10, 2025
WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT
Similar News
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.
News November 10, 2025
JGTL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. మల్లాపూర్, మేడిపల్లి, సిరికొండ, పొలాస, రాయికల్, మన్నెగూడెంలో 14.7℃, సారంగాపూర్, నేరెల్ల, గోవిందారం, కొల్వాయి 14.8, గోదూరు, కోరుట్ల, కథలాపూర్, జగ్గసాగర్, వెల్గటూర్, ఐలాపూర్ 14.9, గుల్లకోట, పెగడపల్లె, మారేడుపల్లి, గొల్లపల్లె, అల్లీపూర్ 15, జైన, మల్లియాల్, తిరమలాపూర్, బుద్దేష్పల్లి, రాఘవపేట 15.1, మెట్పల్లి, జగిత్యాలలో 15.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


