News April 10, 2025

WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT

Similar News

News April 19, 2025

ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు: వర్ధన్నపేట MLA 

image

తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 80961 07107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

News April 19, 2025

ASF: మల్లక్కను చంపిన శివ అరెస్ట్

image

భూపాలపల్లి జిల్లా ఆదివారంపేటకు చెందిన వృద్ధురాలి హత్య కేసులో కాగజ్‌నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లక్క(67) కోడలు శ్రీలతకు SKZR మండలం బారేగూడకు చెందిన శివ(42)తో పరిచయమైంది. ఇద్దరు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక ఆమె ఆదివారంపేటకు రాగా శివ కలవాలని చూశాడు. ఆమె నిరాకరించడంతో మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు శివను అరెస్టు చేశారు.

News April 19, 2025

MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

image

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్‌, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!