News January 31, 2025

WGL: పదవీవిరమణ పొందిన పోలీసులకు సన్మానం

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారంగపాణి, రవీందర్, రమేశ్, గోవర్ధన్‌లను వరంగల్ సీపీ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. తమ సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా తమ గౌరవం తగ్గదని, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని వ్యాయామం కొరకు సమయం కేటాయించాలన్నారు.

Similar News

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

News November 27, 2025

వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

image

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.