News January 31, 2025
WGL: పదవీవిరమణ పొందిన పోలీసులకు సన్మానం

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారంగపాణి, రవీందర్, రమేశ్, గోవర్ధన్‌లను వరంగల్ సీపీ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. తమ సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా తమ గౌరవం తగ్గదని, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని వ్యాయామం కొరకు సమయం కేటాయించాలన్నారు.
Similar News
News July 5, 2025
నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
News July 5, 2025
వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 4, 2025
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.