News November 30, 2024
WGL: పదేళ్లలో BRS అప్పులు చేసి భారం మోపింది: సీతక్క
గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News December 3, 2024
దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
News December 3, 2024
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం
హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.
News December 2, 2024
సిద్దేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.