News April 6, 2025
WGL: పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి మరోసారి తన ప్రతిభ చాటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో ఆయన శనిగపప్పుపై వివేకానందుడు, పల్లికాయపై వినాయకుడి ప్రతిమలను గీసి ఔరా అనిపించారు.
Similar News
News April 18, 2025
WGL: ఖుష్ మహల్ ప్రత్యేకత తెలుసా..?

ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూసారా.. కామెంట్ చేయండి.
News April 18, 2025
మామునూర్: వ్యక్తి సూసైడ్

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మామునూర్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గుంటూరుపల్లికి చెందిన పెనుముచ్చు శ్రీనివాస్ (45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతడి భార్య శ్వేత చూసి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే చనిపోయాడు. శ్రీనివాస్ తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 17, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ. 26 వేలు పలకగా.. దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలికింది. అలాగే 5531 మిర్చికి కూడా నేడు రూ.9,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.