News March 29, 2025
WGL: పసుపు క్వింటాకు రూ.9329

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకి రూ.29,700, సింగిల్ పట్టికి రూ.28వేలు రాగా, దీపిక మిర్చి రూ.13,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే పసుపు క్వింటాకి రూ.9,329, సూక పల్లికాయ రూ.7,500, మక్కలు (బిల్టీ) రూ.2255 ధర పలికింది.
Similar News
News April 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 19, 2025
శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు
News April 19, 2025
అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్‌లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్‌లో చేసి చూపించారు.