News April 15, 2025

WGL: పసుపు క్వింటా రూ.13,909

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ.26 వేలు పలకగా.. దీపిక మిర్చి రూ.12,000 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.9,300, మక్కలు(బిల్టీ) రూ.2,350, పసుపు క్వింటాకి రూ.13,909 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 15, 2025

తూప్రాన్: మహిళ ఆత్మహత్య

image

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 15, 2025

iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

image

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్‌సైట్‌లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.

News November 15, 2025

విజయవాడ: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద గురువారం మధ్యాహ్నం సరస్వతి అనే మహిళను ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.