News August 6, 2024
WGL: ‘పాటమ్మ రాంబాబు’ పై కేసు నమోదు

‘పాటమ్మ తోటి ప్రాణం’ పాట ఫేమ్ రాంబాబుపై కొమరారం పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఎస్సై సోమేశ్వర్ వివరాల ప్రకారం.. మర్రిగూడెంకి చెందిన లతను, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సమీపంలోని అమ్మపురం గ్రామానికి చెందిన రాంబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలంగా రాంబాబు, అతని తల్లిదండ్రులు లతను కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 10, 2025
వరంగల్: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు వేలయింది..!

జిల్లాలో ప్రచారానికి తెరపడడంతో పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, నగదు పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీ పోలింగ్‌కు అధికారులు 800 బూత్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మఫ్టీలో పోలీసులు పర్యటిస్తూ శాంతిభద్రతలకు చర్యలు చేపడుతున్నారు.
News December 9, 2025
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.
News December 8, 2025
వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.


