News April 29, 2024
WGL: ‘పార్టీలు మారే నాయకుల్లారా ఖబడ్దార్’

MP ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో జంపింగ్ నేతలను హెచ్చరిస్తూ వరంగల్ నగరంలోని పలు కాలనీల్లో ప్లెక్సీలు వెలిశాయి. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా.. ఖబడ్దార్ మీకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనితో అలర్ట్ అయిన మున్సిపల్ సిబ్బంది ప్లెక్సీలను తొలగించారు.
Similar News
News November 20, 2025
వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 20, 2025
వరంగల్ కలెక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.
News November 20, 2025
వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.


