News February 13, 2026

WGL: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, మహబూబాబాద్, తొర్రూర్, కేసముద్రం, మరిపెడ, భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ వివరాలను తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.

Similar News

News March 11, 2026

ఏలూరు: రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం!

image

ఏలూరు కార్పొరేషన్ పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కీలక రికార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు ఎలా ఇస్తున్నారు అనే అంశంపై, ఇటీవల బదిలీ అయినప్పటికీ కొందరు అధికారులు పలుకుబడిని ఉపయోగించి తిరిగి ఏలూరులోనే కొనసాగడంపై అధికారులు ఆరా తీశారు. దాడులు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.

News March 11, 2026

MBNR: లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

image

ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ రాత్రి రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా PSకు చేరుకొని ఫిర్యాదు చేసింది.