News January 25, 2025
WGL: పూజారి మృతి.. నిందితుడికి జీవిత ఖైదు

పూజారిపై దాడి చేయగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడంతో నిందితుడికి జీవిత ఖైదు పడింది. వరంగల్ పోచమ్మ మైదాన్ దగ్గర సాయిబాబా ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన సత్యనారాయణపై 26 అక్టోబర్ 2018న సయ్యద్ హుస్సేన్ దాడి చేశాడు. గాయపడ్డ పూజారి నవంబర్ 1న చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందాడు. ఈ క్రమంలో 6 ఏళ్ల అనంతరం నిందితుడికి వరంగల్ జిల్లా కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
Similar News
News December 4, 2025
ఇండియాలో పుతిన్ను అరెస్టు చేస్తారా?

ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.
News December 4, 2025
పంచాయతీ ఎన్నికల దశలో నాయకత్వ లోపం..!

WGL: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దశలోనూ బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ లోపంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 2022లో నియమించిన జిల్లా అధ్యక్షులే కొనసాగుతుండగా, కొత్త కమిటీలపై అధిష్ఠానం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కేడర్లో ఉంది. జనగామ అధ్యక్షుడు కన్నుమూసినా, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసినా ఇప్పటికీ స్థానభర్తీ లేకపోవడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
News December 4, 2025
WGL: సోషల్ మీడియానే మొదటి ప్రచార అస్త్రం..!

ఉమ్మడి ఓరుగల్లులో జీపీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, ఇళ్ల పంపిణీ, శుద్ధి నీటి సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, చమత్కార స్లోగన్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.


