News July 11, 2025
WGL: పెరిగిన మొక్కజొన్న, పసుపు ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా గురువారం రూ.2,430 పలకగా.. ఈరోజు రూ.2,470 పలికింది. అలాగే పసుపు నిన్న
రూ.12,259 ధర రాగా నేడు రూ.12,459 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6,300 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,550 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.
Similar News
News August 31, 2025
WGL: తప్పుల తడకగా ఓటర్ల జాబితా..! మరో మండలంలో వెలుగులోకి..!

గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడంతో పాటు మరణించిన వారి పేర్ల మీద సైతం ఇంకా ఓట్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. తాజాగా గీసుగొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన కౌడగాని రాజగోపాల్ కుటుంబ సభ్యుల నాలుగు ఓట్లు మూడు వార్డుల్లో నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
News August 31, 2025
సీకేఎం ఆసుపత్రిలో సేవల్లో అంతరాయంపై చర్యలు: కలెక్టర్

సీకేఎం ఆసుపత్రిలో గర్భిణుల సేవల్లో అంతరాయంపై నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. రేడియాలజిస్టులు, మత్తు వైద్యుల కొరతను ఎంజీఎం నుంచి డిప్యూటేషన్తో తీర్చాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకంపై చర్యలతో పాటు సమయపాలన పాటించని వారిపై చర్యలు ఉంటాయన్నారు.
News August 30, 2025
ఐనపల్లిలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

ఖానాపూర్ మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద శనివారం రాత్రి సందర్శించారు. గురుకులంలోని విద్యార్థులు, సిబ్బంది హాజరు, తదితర రిజిస్టర్లను, భోజనాన్ని, గదులను పరిశీలించారు. అందుతున్న బోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారితో కలిసి ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులున్నారు.