News March 20, 2024

WGL: పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అత్యాచారం 

image

ప్రైవేటు వసతిగృహంలో ఉంటున్న యువతిపై ఓ నిర్వాహకుడు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూపాలపల్లికి చెందిన వ్యక్తి నయీంనగర్‌లో వసతి గృహం నిర్వహిస్తున్నాడు. అందులో ఉండి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా మరో మహిళతో పెళ్లి నిశ్చయం కావడంతో.. బాధిత యువతి పెళ్లి గురించి ప్రస్తావించగా కులం పేరుతో దూషించాడు.

Similar News

News September 19, 2024

KU: 26 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU పరిధిలో డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.

News September 19, 2024

వరద ప్రభావిత పరిస్థితులపై మంత్రి సీతక్క సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత పరిస్థితులు, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను జిల్లాలో వరదల చర్యలపై పలు వివరాలను సీతక్క అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.

image

> MLG: ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
> WGL: గణపతి నిమర్జనం ట్రాక్టర్ ను ఢీకొన్న అంబులెన్స్
> MLG: అడవి పందులను హతమార్చిన ముగ్గురి అరెస్ట్
> JN: ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మరంలో మంటలు
> MLG: గడ్డి మందు తాగి యువకుడు మృతి
> MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి
> MLG: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
> VKP: విష జ్వరంతో మహిళ మృతి
> WGL: నర్సంపేటలో ఉరి వేసుకుని ఒకరి మృతి