News July 15, 2024
WGL: పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. వరంగల్ డివిజన్‌లో 25 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT
Similar News
News October 7, 2024
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదు: సీతక్క
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేశ్ రెడ్డి, చుక్కల ఉదయ చందర్ కుటుంబాలను నేడు పరామర్శించానని, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News October 7, 2024
వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర రూ.7,100
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు కొత్త పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గతవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,950 పలకగా నేడు రూ.7,100కి చేరినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దసరాకు కొద్ది రోజులు ముందుగా కొత్తపత్తి వస్తుందని, దీపావళి ముగిసే వరకు ఈ పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని వ్యాపారులు పేర్కొన్నారు.
News October 7, 2024
వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గత వారంలో క్వింటా పత్తి రూ.7,450 పలకగా నేడు రూ.7550 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.