News March 6, 2025
WGL: ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైమింగ్స్

నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. రంజాన్ ఉపవాసాల దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పరీక్ష సమయంలో మార్పులు జరిగాయన్నారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4.15 గంటల నిర్వహించే పరీక్షల సమయం మధ్యాహ్నం 12.15 నుంచి 3.15కు మార్చినట్లు చెప్పారు. ఈనెల 6నుంచి 15 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
Similar News
News December 2, 2025
నేను కోచ్గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
News December 2, 2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే(<
News December 2, 2025
సూర్యాపేట జిల్లా ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పండుగలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోందని, మొత్తం 486 గ్రామాలకు గాను, 170 సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.


