News March 23, 2024

WGL: ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు

image

ప్రేమ పేరుతో బాలిక(15)ను వేధించిన యువకుడి(27)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈనెల 18న బాలిక ఇంటికి వెళ్లి వేధించడంతో బాలిక తల్లి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

సైన్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

image

హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్‌కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 19, 2024

NSPT: అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

image

నర్సంపేట నియోజకవర్గంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారని, నాటి అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతుందని ‘X’లో మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News September 19, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 341 రకం మిర్చి నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. నిన్న ఈ మిర్చికి రూ.16,500 ధర రాగా.. నేడు రూ.17 వేలు పలికింది. అలాగే తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.18,000 ధర రాగా ఈరోజు రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా నేడు రూ.17 వేలు వచ్చిందని వ్యాపారులు తెలిపారు.