News May 25, 2024

WGL: బరిలో 52 మంది..!

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈనెల 27న జరగనుంది. 3 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉ. 8 నుంచి సా. 4 వరకు పోలింగ్ జరగనుంది. బరిలో BRS నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

Similar News

News February 10, 2025

వేయి స్తంభాల ఆలయానికి 862 ఏళ్లు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. కాకతీయ శిల్పకళా శైలిలో రుద్ర దేవుడు ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయాన్ని నిర్మించి సుమారుగా 862 ఏళ్లు అవుతుంది. ఆలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ శిల్పకళా సంపదను తిలకిస్తుంటారు. మీరు వేయి స్తంభాల ఆలయానికి వెళితే కామెంట్ చేయండి.

News February 10, 2025

భద్రకాళి చెరువులో ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి?

image

సుందరీకరణలో భాగంగా భద్రకాళి చెరువు నీటిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఐలాండ్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మించేందుకు గతంలోనే ప్రభుత్వం కసరత్తు చేయగా.. ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2016-17లో రూ.2.78 కోట్లతో తీగల వంతెన ప్రతిపాదించినా ముందడుగు వేయలేదు. అయితే నిర్మాణం పూర్తైతే లక్నవరంను మించిన టూరిస్ట్ స్పాట్‌గా భద్రకాళి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

News February 9, 2025

వరంగల్: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు కార్యాలయానికి రావద్దని ఆమె కోరారు.

error: Content is protected !!