News March 19, 2024
WGL: బలవంతంగా వ్యభిచారంలోకి..

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన హసన్పర్తిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీకాలర్ ఉద్యోగం కోసం ఈనెల 10న HYD వచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
Similar News
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.
News April 20, 2025
ఆనాటి నెమలి కొండే.. నేటి నెక్కొండ..!

ఆనాటి నెమలి కొండే.. ఇప్పటి నెక్కొండ. మండల పరిధిలో 19 గ్రామాలు ఉన్నాయి. నర్సంపేట డివిజన్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఏకైక రైల్వేస్టేషన్ నెక్కొండ. పత్తి, మిరప, మొక్కజొన్న, వరి ప్రధాన పంటలుగా ఉన్నాయి. భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరిపి పేదలకు పెద్ద ఎత్తున భూములు పంచిన చరిత్ర నెక్కొండది. సంక్రాంతి పర్వదినాన నెక్కొండ శివారులో జరిగే చెన్నకేశవస్వామి జాతర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.