News September 25, 2024
WGL: బస్ సౌకర్యం కల్పించాలనే అంశంపై స్పందన

తాటికొండ-ఘనపూర్ మధ్య బస్సు సర్వీస్ పునరుద్ధరణకై AISF జిల్లా కన్వీనర్ యునుస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై TGSRTC వెంటనే స్పందించి ఈ అంశాన్ని పరిశీలించాలని DyRM(O)WLకు సూచించింది. బస్సు సర్వీస్ ప్రపోజల్ అంశాన్ని పరిశీలిస్తామని DyRM(O)WL ట్వీట్ చేశారు. ట్వీట్‌కు వెంటనే స్పందించినందుకు గాను ఆర్టీసీ అధికారులకు AISF నేతలు కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News December 19, 2025
బీఆర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

బీఆర్ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న పోషకాహారం, పిల్లల హాజరు, శుభ్రత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను మంత్రి నిశితంగా పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా అమలవ్వాలని ఆదేశించారు.
News December 19, 2025
వరంగల్ జిల్లాలో యూరియా నో స్టాక్..!

రైతులు యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొని వచ్చింది. తమకు కావలసిన యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుంటే రైతులకు దగ్గరలో ఉన్న డీలర్ వద్ద నుంచి బస్తాలు తీసుకెళ్లవచ్చని అధికారులు సూచించారు. దీంతో యాప్‌లో యూరియా బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతుంది. వరంగల్ జిల్లాలో యూరియా స్టాక్ లేదని యాప్‌లో చూపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News December 19, 2025
వరంగల్: యూరియా యాప్ విధానంపై రైతుల ఆవేదన

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యూరియా కోసం మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం తెలియని, స్మార్ట్ ఫోన్ లేని వారు ఎక్కువగా ఉండటంతో ఈ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని వారు కోరుతున్నారు.


