News September 25, 2024

WGL: బస్ సౌకర్యం కల్పించాలనే అంశంపై స్పందన

image

తాటికొండ-ఘనపూర్ మధ్య బస్సు సర్వీస్ పునరుద్ధరణకై AISF జిల్లా కన్వీనర్ యునుస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీనిపై TGSRTC వెంటనే స్పందించి ఈ అంశాన్ని పరిశీలించాలని DyRM(O)WLకు సూచించింది. బస్సు సర్వీస్ ప్రపోజల్ అంశాన్ని పరిశీలిస్తామని DyRM(O)WL ట్వీట్ చేశారు. ట్వీట్‌కు వెంటనే స్పందించినందుకు గాను ఆర్టీసీ అధికారులకు AISF నేతలు కృతజ్ఞతలు చెప్పారు.

Similar News

News October 15, 2024

వరంగల్ జిల్లాకు వర్ష సూచన

image

రాష్ట్రంలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 18 వరకు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణశాఖ జారీ చేసింది.

News October 15, 2024

ట్రాన్స్‌ఫార్మర్లపై టోల్ ఫ్రీ నెంబర్లు ముద్రించాలి: CMD

image

TGNPDCL, హనుమకొండ, విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్ని సర్కిళ్ల SE, డివిజినల్ ఇంజినీర్ల(టెక్నికల్)తో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. CMD మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌పై టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912 ముద్రించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఈ నంబర్లను వినియోగదారులకు చేరేలా చూడాలన్నారు.

News October 15, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
> MHBD: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
> WGL: గడ్డి మందు తాగి యువకుడు మృతి!
> HNK: బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
> MHBD: పిడుగుపాటుకు గురై మూడు ఆవులు మృతి
> TRR: బైకును ఢీ-కొట్టిన బోర్ వెల్ లారీ.. వ్యక్తి మృతి