News July 25, 2024
WGL: బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు
నక్కలపల్లిలోని ఓ బార్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మటన్, చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బార్‌లోని వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహిస్తున్నారని, సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులతో బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు బార్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
Similar News
News October 13, 2024
వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్ START
4 రోజుల వరుస సెలవులు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు (సోమవారం) పునఃప్రారంభం కానుంది. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం కానుండగా, ఉదయం 6 గంటల నుంచే క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి.
News October 13, 2024
టేకుమట్ల: చలివాగులో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట -టేకుమట్ల చలివాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఆదివారం మృతిచెందారు. మండలంలోని వెల్లంపల్లికి చెందిన సొల్లేటి రాములు(45) గ్రామపంచాయతీ సిబ్బంది, గీస హరీశ్ (25) ఉదయం 10 గంటలకు చలివాగులో స్నానానికి వెళ్లారు. ప్రమాదశావత్తు అందులో మునిగిపోయి మృతిచెందారు. పండుగ తెల్లవారే మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది.
News October 13, 2024
తెప్పోత్సవంలో మంత్రి కొండా సురేఖ
భద్రకాళి ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. అమ్మవారికి సాయంత్రం చెరువులో అర్చకులచే చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి బద్రేశ్వరులను హంస వాహనంపై ఊరేగించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై తెప్పోత్సవం (జల క్రీడోత్సవం) కన్నుల పండువగా జరిగింది.