News May 5, 2024
WGL: బిర్యాని సెంటర్‌లో వెయిటర్ అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యకి మృతి చెందిన ఘటన ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఓ బిర్యాని సెంటర్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి అదే హోటల్‌లో మృతి చెందాడు. చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వంటిపై గాయాలున్నాయని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Similar News
News April 23, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 23, 2025
వరంగల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కళాశాలలు

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం మంగళవారం వెలువడ్డాయి. ఫలితాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటినట్లు డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందని, జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను తగు రీతిలో సత్కరించనున్నట్లు తెలిపారు..
News April 23, 2025
వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడుత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.