News September 27, 2024
WGL: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
Similar News
News November 25, 2024
MHBD: మొదటి జీతం అందుకోకుండానే టీచర్ మృతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకొని మొదటి జీతం అందుకోకుండానే రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. MHBD జిల్లా గంగారం మండలం బావురుగొండ టీచర్ ఉపేందర్ (45) పాఠశాలకు వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని మృతి చెందారు. బయ్యారం మండలానికి చెందిన ఉపేందర్ ఇటీవల ఎస్జీటీ ఉద్యోగం సాధించారు. ఉపేందర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.
News November 25, 2024
వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన వరంగల్ కలెక్టర్ సత్య శారద
గీసుగొండ మండల కేంద్రంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి రైతులు పండిస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలను పండిస్తే నేలలు బాగుపడటమే కాకుండా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరిబాబు, స్థానిక రైతులు పాల్గొన్నారు.