News July 16, 2024
WGL: భారీగా కురుస్తున్న వర్షాల సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్లు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వరంగల్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3434, 91545 25936ను సంప్రదించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News December 4, 2025
వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.
News December 4, 2025
వరంగల్: పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర మహాసభలు వాయిదా..!

డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా 2026 జనవరి 5, 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తెలిపారు.
News December 4, 2025
వరంగల్ జిల్లా తొలి విడత ఎన్నికల్లో 11 స్థానాలు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక ఎన్నికల్లో WGL జిల్లాలో 11 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాయపర్తి మండలంలో 6, పర్వతగిరిలో 3, వర్ధన్నపేటలో 2 చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పోతురెడ్డిపల్లి, కిష్టపురం సూర్యతండా, బాలునాయక్ తండాల్లో కాంగ్రెస్ నుండి సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్వతగిరిలో మోత్యతండా, సూపతండా, శ్రీనగర్‌లో కూడా ఏకగ్రీవం కాగా వర్ధన్నపేటలో రామోజీ కుమ్మరిగూడెం, చంద్రుతండా అయ్యాయి.


