News February 13, 2025
WGL: భారీగా పతనమవుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.6,900కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.
Similar News
News December 14, 2025
వరంగల్: 18.82% పోలింగ్ @9AM

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.
News December 14, 2025
రాంనగర్లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.
News December 14, 2025
HNK, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు

రెండో విడత పంచాయతీ ఎన్నికలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. నేడు పోలింగ్ అనంతరం వచ్చే ఫలితాలు గ్రామీణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.


