News July 11, 2024

WGL: భూ నిర్వాసితులకు రూ.10.38 కోట్ల పరిహారం అందజేత

image

మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ నిర్మాణానికి సంబంధించి వరంగల్ జిల్లా మీదుగా 38.2 కిలోమీటర్ల మేర వెళ్లే రహదారి కోసం 160 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. మొత్తం 168 మంది భూ నిర్వాసితులకు రూ.10.38 కోట్ల నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలో పరిహారం చెల్లిస్తామని అన్నారు.

Similar News

News October 2, 2024

బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

News October 2, 2024

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

image

పీపుల్స్ ప్లాజాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

News October 2, 2024

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

image

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.