News March 7, 2025
WGL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఉమ్మడిWGLలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది.ఏమంటారు!
Similar News
News March 22, 2025
నిర్మల్: ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలు

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరగనున్న సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందించనున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. శనివారం పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. భద్రాచలం వెళ్లలేని భక్తులు బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన కౌంటర్లో రూ.151 చెల్లిస్తే వారి ఇంటి వద్దకే తలంబ్రాలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 22, 2025
NRPT: 18 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రెండో రోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,635 మందికి ఇందులో 8 మంది విద్యార్థులు మినహాయింపు ఇవ్వగా 7,609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ జరిపారు.
News March 22, 2025
డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

AP: నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో DMK నిర్వహించిన సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని జనసేన వెల్లడించింది. అయితే వేర్వేరు కూటములలో ఉన్నందున హాజరుకాలేదని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు పవన్ సూచన మేరకు DMKకు సమాచారం అందించామని పేర్కొంది. సమావేశంలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. డీలిమిటేషన్‌పై తమకు ఓ విధానం ఉందని, దీన్ని ఓ సాధికార వేదికపై వెల్లడిస్తామని ప్రకటించింది.