News March 7, 2025
WGL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఉమ్మడి WGLలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవరముంది. ఏమంటారు!
Similar News
News December 1, 2025
CSIR-IHBTలో ఉద్యోగాలు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News December 1, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆలయాల్లో రద్దీపై ప్రత్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
News December 1, 2025
ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాను: MP

రామగుండం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును సోమవారం ఢిల్లీలో కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈనెల 3, 4 తేదీలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుందన్నారు. భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.


