News March 7, 2025
WGL: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ఉమ్మడి WGLలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవరముంది. ఏమంటారు!
Similar News
News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News March 23, 2025
HNK: జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్..

✓ HNK: ముగ్గురు చైన్ స్నాచర్లతో పాటు దొంగ అరెస్ట్
✓ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
✓ HNK: బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: CP
✓ కమలాపూర్: ఇసుక ట్రాక్టర్ పట్టివేత
✓ శాయంపేట పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
✓ HNK: విద్యార్థులకు షీ-టీంపై అవగాహన
✓ ఇంతేజార్ గంజ్: పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు
News March 23, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 3 నుంచి పదోన్నతి పొందిన టీచర్లకు శిక్షణ: డీఈవో

జిల్లాలో నూతనంగా పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3 నుంచి 4 వరకు రెండు రోజుల పాటు పాఠశాల అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపైన మెదక్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ శిక్షణను ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.