News July 8, 2024
WGL: మనస్తాపంతో మహిళా రైతు బలవన్మరణం
రెండు సార్లు విత్తనాలు వేసినా.. మొలకెత్తకపోవడంతో మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గుబ్బెడి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కమలమ్మ 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తోంది. జూన్ నెలలో అప్పు తీసుకొచ్చి విత్తనాలు వేసినా వర్షాలు లేక మొలకెత్తలేదు. విత్తనాలు మొలకెత్తక, తెచ్చిన అప్పు తీర్చలేక మనస్తాపానికి గురైన కమలమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News October 7, 2024
వరంగల్: ఈనెల 9న జాబ్ మేళా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 9న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. ములుగు రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదు: సీతక్క
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేశ్ రెడ్డి, చుక్కల ఉదయ చందర్ కుటుంబాలను నేడు పరామర్శించానని, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News October 7, 2024
వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర రూ.7,100
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు కొత్త పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గతవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,950 పలకగా నేడు రూ.7,100కి చేరినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దసరాకు కొద్ది రోజులు ముందుగా కొత్తపత్తి వస్తుందని, దీపావళి ముగిసే వరకు ఈ పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని వ్యాపారులు పేర్కొన్నారు.