News August 11, 2024
WGL: మరణంలోనూ వీడని బావ, బామ్మర్దుల బంధం
రోడ్డు ప్రమాదంలో శనివారం <<13825176>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. బంధువుల ప్రకారం.. వేలేరు మం. మల్లికుదుర్లకు చెందిన మల్లారెడ్డి(52), అమరేందర్ రెడ్డి(42) మేనబావ, బామ్మర్దులు. వీరి వయసులో వ్యత్యాసం ఉన్నా స్నేహితుల్లాగే ఉండేవారు. ఈ క్రమంలోనే బైకుపై వెళ్తుండగా నిన్న సా. జానకీపురం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News September 21, 2024
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా
అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
News September 21, 2024
అక్టోబర్ 3 నుంచి 13 వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి(దసరా) మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి తెలిపారు. అక్టోబర్ 12 విజయదశమి దసరా సందర్భంగా భద్రకాళి తటాకంలో హంస వాహన తెప్పోత్సవం, అక్టోబర్ 13 శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
News September 20, 2024
వరంగల్ మార్కెట్లో పసుపు, పల్లికాయ ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సూక పల్లికాయ(పాతది) ధర రూ.6వేలు పలకగా, సూక పల్లికాయ(పచ్చిది) రూ.5,780, పచ్చి పల్లికాయ రూ.4, 600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపుకి రూ.11,859 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.