News August 13, 2024
WGL: మళ్లీ రికార్డు ధర పలుకుతున్న మక్కల ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ రికార్డు ధర నమోదు చేస్తున్నాయి. 2 నెలల క్రితం వరకు రూ.2,790 పలికిన మక్కలు ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. మళ్లీ వారం రోజులుగా పెరుగుతున్నాయి. సోమవారం క్వింటా మక్కలు ధర రూ.2,745 ధర పలకగా.. నేడు రూ.2,765 ధర పలికాయని అధికారులు తెలిపారు.
Similar News
News September 13, 2024
ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి: కలెక్టర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ KUDA అధికారులను ఆదేశించారు.
News September 12, 2024
BREAKING.. BHPL: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2024
వర్గీకరణ అమలు అధ్యయన కమిటీలో సభ్యురాలిగా సీతక్క
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలుపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకీ చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో-చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా ములుగు జిల్లాకు చెందిన సీతక్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవిలు నియమాకం అయ్యారు.