News March 24, 2025
WGL మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి.. ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మిర్చి పోటెత్తింది. అయితే తాము ఆశించిన విధంగా ధరలు రాలేదని అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,000 ధర రాగా.. 341 రకం మిర్చికి రూ.12,400 పలికిందని వ్యాపారులు తెలిపారు. అలాగే వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకి రూ.14,500 ధర వచ్చిందన్నారు.
Similar News
News September 19, 2025
నేడు YCP ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
News September 19, 2025
వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.
News September 19, 2025
VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.