News August 16, 2024
WGL: మార్కెట్లో క్వింటా పత్తి రూ.7125
గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత మొన్నటితో పోలిస్తే తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,125 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News November 27, 2024
చలి తీవ్రతతో వణుకుతున్న ఓరుగల్లు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో చలి జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వయో వృద్ధుల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 27, 2024
వరంగల్ రీజియన్‌లో 170 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వరంగల్ రీజియన్‌లో 170 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: సీతక్క
రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని, రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.