News April 10, 2025

WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు బుధవారం ధర రూ.28వేలు పలకగా.. నేడు రూ.28,500 పలికింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,200 పలకగా.. ఈరోజు రూ.12,500కు తగ్గింది. 5531 మిర్చికి బుధవారం రూ.9,300 పలకగా నేడు రూ.9,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మక్కలు(బిల్టీ) రూ.2,295, పసుపు క్వింటాకి రూ.13,688 ధర వచ్చాయి.

Similar News

News April 22, 2025

నిర్మల్: హాల్‌టికెట్లు వచ్చేశాయ్..!

image

తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష సంబంధిత హాల్ టికెట్లు విడుదలైనట్లు కుంటాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడించారు. విద్యార్థి యొక్క రిఫరెన్స్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.

News April 22, 2025

సిద్దిపేట: ‘ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లను అందించాలి’

image

పూర్తిగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని, అర్హులకు లబ్ధి చేకూర్చలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ యండీవీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఐడీఓసీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News April 22, 2025

NRPT: ‘భూ భారతి సదస్సులో రైతుల ఫిర్యాదులపై అరా’

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యదర్శి కె. మాణిక్ రాజ్ సూచించారు. సోమవారం నారాయణపేట పర్యటనకు వచ్చిన ఆయనకు కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వర్, బేన్ షాలోమ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. భూ భారతి పోర్టల్, తాగునీటి సమస్యపై సమీక్ష చేశారు. సదస్సులో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అరా తీశారు.

error: Content is protected !!