News January 24, 2025

WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 16, 2025

మంగళవారం ఈ పనులు చేయకూడదట..

image

హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఈ రోజు కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటింగ్, షేవింగ్, గోర్లు కత్తిరించడం వంటివి చేయరాదు. చేస్తే ఆయుష్షు తగ్గుతుంది. అలాగే, అంగారక ప్రభావం వల్ల కొత్త బట్టలు కొనడం, ధరించడం, కొత్త బూట్లు వేసుకోవడం మంచిది కాదు. మసాజ్ చేయించుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు, ఇంట్లో తగాదాలకు దారితీయవచ్చు’ అంటున్నారు.

News December 16, 2025

త్రివిక్రమ్.. కెరీర్‌లో తొలిసారి!

image

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్‌-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్‌ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 16, 2025

‘జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికలు లేవు’

image

చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క జూలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడలేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 10 ఏకగ్రీవంగా ఖరారయ్యాయని, మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17న ఎన్నికలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు.