News January 24, 2025

WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 19, 2025

లగ్జరీ కంటే సింప్లిసిటినే నాకు ముఖ్యం: రకుల్

image

తనకు లగ్జరీ కంటే సింప్లిసిటీనే ముఖ్యమని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. అందుకే తన పెళ్లిని చాలా సింపుల్‌గా చేసుకున్నట్లు తెలిపారు. ‘విరాట్ కోహ్లీ-అనుష్కలాగే మేం చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నాం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యాం. మా వివాహానికి నో ఫోన్ పాలసీ పాటించాం. ఒక్క అతిథి కూడా ఈవెంట్‌లో ఫోన్‌తో కనిపించలేదు. పెళ్లి జరిగిన 3 రోజులు చాలా ఎంజాయ్ చేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News February 19, 2025

మిర్చి రైతులపై జగన్‌వి పచ్చి అబద్దాలు: అచ్చెన్నాయుడు

image

AP: గుంటూరు మిర్చి యార్డులో మాజీ CM జగన్ పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయనను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఆయన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజా కొనలేదు. డ్రిప్పులు అందించలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక్క పైసా ఇవ్వలేదు. మేం వచ్చి 6 నెలలు కాకముందే గగ్గోలు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

News February 19, 2025

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

పీఎం కిసాన్ 19వ విడత కింద రైతుల ఖాతాల్లో రూ.2000లను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న జమ చేయనుంది. ఏటా రూ.6000 3 విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఈ నెల 24లోపు E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయండి.

error: Content is protected !!