News January 24, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 7, 2025
సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.
News February 7, 2025
సినిమా రంగంలో కురవి కుర్రాడు!

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.
News February 7, 2025
నెక్కొండ: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలేనా..?

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఆ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాబోయేది పంచాయతీ ఎన్నికలా..? లేక మున్సిపల్ ఎన్నికలో తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. నెక్కొండతో పాటు నెక్కొండ తండా, టీకే తండా, గుండ్రపల్లి, అమీన్‌పేటల్లో గ్రామ సభలను సైతం నిర్వహించారు. కానీ ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడ్డారు.