News September 4, 2024
WGL: మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @దాదా రణదేవ్ దాదా మృతిచెందాడు. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ బార్డర్లో అతను మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన జగన్ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెమని దంతేవాడ ఎస్పీ ప్రకటించారు.
Similar News
News December 12, 2025
వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొత్త సమీకరణలు!

WGL తూర్పు కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.


