News September 6, 2024

WGL: ‘మావో’ల ఎన్ కౌంటర్‌కు టోర్నడో ఎఫెక్ట్!

image

మావోయిస్టుల ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి అడవుల్లో ఇటీవలే సంభవించిన టోర్నడో ఎఫెక్ట్ కారణంగా వినిపిస్తోంది. 2 నెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం ప్రవేశించింది. అయితే తాడ్వాయి మండలంలో టోర్నడో తరహాలో భారీ వృక్షాలు నేలకూలడంతో లచ్చన్న దళం కదలికలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రాద్రి జిల్లా అడవులకు దళం పరిమితమైంది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఎన్కౌంటర్లో మృత్యువాత పడాల్సి వచ్చింది.

Similar News

News September 17, 2024

WGL: ఘోరం.. మతిస్తిమితం లేని మహిళపై అఘాయిత్యం

image

MHBD(D) కేసముద్రం(M)లో మతిస్తిమితం లేని మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 10న ఇద్దరు యువకులు సదరు మహిళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు ఆమె కొడుకును బయటకు తీసుకెళ్లగా, మరొక వ్యక్తి అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు ఆమె కొడుకు ఫోన్‌లో వీడియో రికార్డింగ్ పెట్టి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. మహిళ కుటుంబం ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది.

News September 17, 2024

వరంగల్: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

image

వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ, కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారదదేవి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఉన్నారు.

News September 17, 2024

వరంగల్: జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.