News January 31, 2025

WGL: రైతన్నకు నిరాశ.. తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఏరోజు ధర పెరుగుతుందో, ఏరోజు తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. గత వారం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,010పలకగా.. నేడు రూ.10 తగ్గి రూ.7 వేలకు చేరినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News December 3, 2025

చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

image

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.

News December 3, 2025

‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

image

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్‌ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్‌నకు 1.4 కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్‌లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్‌లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.

News December 3, 2025

సిద్దిపేట: ఇద్దరు భార్యలతో కలిసి నామినేషన్

image

అక్బర్‌పేట- భూంపల్లి మండలం జంగాపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి ఇద్దరు భార్యలతో కలిసి ఓ నామినేషన్ వేయడం జిల్లాలో సంచలనంగా మారింది. సర్పంచ్ ఓసీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్థులంతా కలిసి వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గతనెల 30న మొదటి భార్య నామినేషన్ వేసిన ఆయన.. స్క్రూటినిలో ఎక్కడ తిరస్కరిస్తారో అన్న భయంతో మంగళవారం రెండో భార్యతో కలిసి మరో నామినేషన్ దాఖలు చేశారు.