News March 18, 2025

WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News December 7, 2025

కల్వకుర్తి: ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

image

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై మాధవ రెడ్డి సూచించారు. వాహనాల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

News December 7, 2025

ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

image

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

News December 7, 2025

అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

image

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్‌కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.